Take a fresh look at your lifestyle.

ఖమ్మం వరద బాధితులకు ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు….

0 2,008

ఖమ్మం వరద బాధితులకు ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : గత 20 రోజుల ముందు కురిసిన భారీ వర్షాలకు అతలకుతులమైన ఖమ్మం వరద బాధితులకు ప్రతి ఒక్కరు ఆదుకోవాలని, ఆపదలు అండగా నిలవాలని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అమ్మ నాన్నల జ్ఞాపకార్థంతో ఖమ్మం వరద బాధితులకు నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కళాకారులు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ తన అమ్మ నాన్నల జ్ఞాపకర్థంతో ఖమ్మం వరద బాధితులకు తమ వంతు సహాయం చేయడం జరిగింది. విపత్తులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని తెలిపారు. ప్రజలు కూడా ఈ సహాయంలో భాగసములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సొంటెం సాయిలు, అన్యబోయిన శ్రీనివాస్, సొంటెం రాజలింగం యాదవ్ ,దేవరాజ్ వడ్ల వెంకన్న ,కత్తూరి కిషన్ ,శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.