రుణమాఫీ కోసం మెలికలు పెట్టడం సరికాదు.
— పార్టీ కేంద్రకం సభ్యులు కామ్రేడ్ వనం సుధాకర్

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 4 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎం సి పి యు పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ ఓర్సు నరసింహ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ కేంద్రకం సభ్యులు వనం సుధాకర్ హాజరై మాట్లాడుతూ రైతు రుణమాఫీ గత భారత ప్రభుత్వం చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు ఎక్కడైతే రైతులు ఉన్నారో ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ వాళ్లకు అనుకూలంగా బడ్జెట్ పెట్టకపోవడం సిగ్గుచేటు అలాగే బడ్జెట్ విషయానికొస్తే నోట్లో బెల్లం పెట్టి కడుపులో కారం కొట్టిన చిన్నంగా బడ్జెట్ ఉందని ఎదవ చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ అనేక మెలికలు పెట్టి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేటికి కూడా రుణమాఫీ చేయకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తుందని అన్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా కామారెడ్డి నుంచి మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు స్వామి, సుజాత, నాగరాజ్, లీల, భార్గవి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.