Take a fresh look at your lifestyle.

కనీస వేతనాలు అమలు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం…..

0 1,215

కనీస వేతనాలు అమలు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

నిజామాబాద్, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ( IFTU ) జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి చర్చించడం జరిగింది. సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో పలు అంశాలను చర్చించి, ఈ కింది తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్లకు కనీస వేతనాలు తక్షణమే అమలు చేయాలన్నారు. పని భారం తగ్గించాలన్నారు. జాబ్ చార్ట్, వీక్లీ ఆఫ్ అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకు పెంచి, బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. మోడల్ స్కూల్ సిబ్బందికి కేజీబీవీ పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలన్నారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్ ప్రక్రియను పరిశీలించాలన్నారు.కనీస వేతనాల అమలులో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తే, ఆందోళనలను ఉదృతం చేసి, సమ్మెకు వెళ్తామన్నారు.ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టీ.యు జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తెన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, కేజీబీవీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరి, జిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంతి సంధ్య సహాయ కార్యదర్శి సుజాత దివ్య కోశాధికారి శోభ నాయకులు రాధ, లత రమ, శారద, సరోజ, సుమలత, ఉమా, సుమలత, సరస్వతి, అరుణ, జ్యోతి, విక్టోరియా, సునీత, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.