Take a fresh look at your lifestyle.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

0 1,335

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామారెడ్డి జిల్లా,  అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం కో ఆపరేటివ్ సొసైటీ వద్ద మాచారెడ్డి రైతు కన్వీనర్ రావుల ప్రభాకర్ కొబ్బరి కాయ కొట్టి వడ్ల కాంటాను ప్రారంభించినారు. రైతులకు కల్లాలను ఏర్పాటు చేసి వారికి తాటి పత్రులను, త్రాగడానికి నీరు, కాంటలను ప్రతి కాళ్ళనికి అందించాలని కోరారు. వరి క్వింటాలు కు రూ. 2320/- ధర నిర్ణయం చేయనైనది. ఇట్టి కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పూలచంద్ నాయక్, డైరెక్టర్ ధర్మాజీ కిషన్ గౌడ్, డైరెక్టర్ బుచ్చిరెడ్డి, సి ఈ ఓ చంద్రారెడ్డి, ఏ ఈ ఓ ప్రభాకర్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.