Take a fresh look at your lifestyle.

వామ్మో ఆ మహిళా కడుపు నుంచి భారీ కణితి తొలగింపు……

0 1,233

వామ్మో ఆ మహిళా కడుపు నుంచి భారీ కణితి తొలగింపు

ఎల్లారెడ్డి , అక్టోబర్ 15 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి 4.5కిలోల అండాశయ కణతిని తొలగించారు. పూర్తివివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం, పిట్లం తండాకు చెందిన మేఘవత్ లాలిత (41) అనారోగ్యంతో ఎల్లారెడ్డి పట్టణంలోని ఈ నెల 10వ తేదీన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో అండాశయ కణతి ఉందని, దాన్ని తొలగించాలని తెలిపారు.కాగా మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో నుంచి సుమారు 4.5కిలోల అండాశయ కణతిని విజయవంతంగా తొలగించామని ఆసుపత్రి డాక్టర్ రవీంద్రమోహన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.