Take a fresh look at your lifestyle.

పోలీస్ కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం…

0 1,225

పోలీస్ కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం

— జిల్లా ఎస్పి సింధు శర్మ

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (లోకంతీరు) : కామారెడ్డిజిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నెలవారి సంక్షే సమావేశాన్ని ఎస్పీ సింధు శర్మ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…! పెండింగ్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి డి‌ఎస్‌పి, సిఐలను, ఎస్ఐలను అడిగి కేసు ఫైల్స్ ను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, పేకాట, జూదం, తదితర వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణిచివేయాలి అన్ని సూచించారు.సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వార శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలని అధికారుల ను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివరణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ క్రైమ్ నేరస్తులను పి టి వారెంట్ ద్వారా కోర్టు లో ప్రవేశపెట్టి సైబర్ బాధితులకు భాసటగా నిలవాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో వుండాలని, గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏవిధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనే విషయాలపై తగు సలహాలు మరియు సూచనలు చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ను త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ పోర్న్ ఏరియాగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించాలని ఎస్సై సీఐ స్థాయి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.నేర నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను చేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామలలో, ప్రధాన కూడళ్లలో, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకుఅందుబాటులో ఉంటూ, ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్, మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, డీఎస్పీలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు,ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.