Take a fresh look at your lifestyle.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం….

0 1,242

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

– మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్

ఎల్లారెడ్డి, నవంబర్, 19 ( లోకంతీరు ) : 
పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి గొప్ప వరమని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారికి సీఎం సహాయ నిధి నుంచి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వైద్య ఖర్చులను మంజూరు చేయించి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సంబంధించిన చెక్కులను చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. అన్నివర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. ఎల్లారెడ్డిలో అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మందికి సీఎం సహాయ నిధి అందించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఇంకా సాయం అందజేస్తానని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్థానికుల నాయకుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, కౌన్సిలర్ అల్లం శ్రీను కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాయాజోద్దీన్,విద్యాసాగర్, వెంకన్న, షేకవత్ అలీ,తిరుపతి,ప్రశాంత్ గౌడ్,ఇంతియాజ్, సజ్జత్,శంకర్, సుజిత్,అశోక్,రాములు, సాయిలు,యేసు,రాములు,ప్రసాద్,సిద్దు,భూమయ్య,సతీష్,మహేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.