Take a fresh look at your lifestyle.

జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు….

0 1,184

జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 24 (లోకంతీరు) : జిల్లాలోని బాన్సువాడ పట్టణం సాయికీర్తి జూనియర్ కళాశాలలో శనివారం సమాచార హక్కుచట్టం 2005 మరియు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు క్రిమినల్ చట్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ గంగరాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ న్యాయమూర్తి ఏం.ఏ. సలీం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు క్రిమినల్ కొత్త చట్టాల గురించి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జి వడ్ల శివరాం, శ్రీను సమాచార హక్కు చట్టం 2005 గురించి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గంగరాజు, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.