Take a fresh look at your lifestyle.

యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం….

0 1,163

యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం.

– మన ఉగాది సిండికేట్ ఆధ్వర్యంలో 5 వ సారి రక్తదాన శిబిరం
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర, చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి జిల్లా , నవంబర్ 03 ( లోకంతీరు ) : జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ మందిరంలో మన ఉగాది సిండికేట్ ఆధ్వర్యంలో 5 వ సారి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు బలే సురేందర్, మ్యాక నాగరాజులను సన్మానించారు. వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటివరకు లేవని మానవత్వంతో రక్తదాతలు ముందుకు వచ్చినప్పుడే ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడవనచ్చునని అన్నారు. దేశంలోనే తల సేమియా చిన్నారులకు అత్యధిక యూనిట్ల రక్తాన్ని అందజేసిన ఘనత కామారెడ్డి జిల్లాకే దక్కడం జరిగిందని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని అన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలకు అభినందనలు తెలియజేసి ప్రశంస పత్రాలను అందజేసారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు జమీల్ అహ్మద్, మన ఉగాది సిండికేట్ సభ్యులు, ప్రభుత్వ వైద్యశాల రక్తనిధి కేంద్రం టెక్నీషియన్లు అమర్, నూర్ సింగ్, పోశెట్టి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.