Take a fresh look at your lifestyle.

నేడే ఇంటర్నేషనల్ ట్విన్స్ డే..!

0 194

నేడే ఇంటర్నేషనల్ ట్విన్స్ డే..!

– అంతర్జాతీయ కవల ల దినోత్సవం
– గుమ్మడి లక్ష్మీనారాయణ సామాజిక వేత్త

Varshith & Harshith
Varshith & Harshith
శ్రేయాంశ్ దేశ్ ముఖ్సారాంశ్ దేశ్ ముఖ్
శ్రేయాంశ్ దేశ్ ముఖ్ సారాంశ్ దేశ్ ముఖ్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : తల్లి గర్భం నుంచి ఒకే సమయంలో లేదా కొన్ని సెకన్ల వ్యవధిలో జన్మిస్తే వారిని కవల పిల్లలు అంటారు. ఇద్దరు మగ పిల్లలు, లేదా ఆడ పిల్లలు కావచ్చు, అరుదుగా ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ కావచ్చు. కవలలుగా జన్మించే పిల్లల్లో చాలా వరకు ఒకేలా ఉంటారు. శరీర నిర్మాణం, రంగు, జట్టు, ఎత్తు వంటివన్నీ దాదాపు 99 శాతం ఒకేలా ఉంటాయి. ఒకే పోలికతో ఉండే కవలలను వైద్య పరిభాషలో ‘ఐడెంటికల్ ట్విన్స్’ అని వేర్వేరు పోలికలతో జన్మించిన కవల పిల్లలను ‘నాన్ ఐడెంటికల్ ట్విన్స్’ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 130 మిలియన్ల ట్విన్స్ ఉన్నారని 2006లో ఓ సర్వే ద్వారా బయటపడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 22 న అంతర్జాతీయ కవలల దినోత్సవం నిర్వహించడం ప్రాచుర్యం లోకి వచ్చింది.పోలెండులో జన్మించిన ”మోజస్‌, ఆరన్‌ విల్‌కాక్స” అనే కవల సోదరులు మరణించిన రోజును ప్రపంచ కవలల దినోత్సవంగా తొలిసారి 1976లో నిర్వహించారు. దీనికి ఒక కథనం కూడా ప్రచారంలో వుంది. మోజస్‌, ఆరస్‌ విల్‌కాక్స తాము నివసిస్తున్న ఇంటి (ఊరు) కి ‘ట్విన్స్‌ బర్గ్‌’ అని పేరు పెట్టుకుని ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. వివాహం తరువాత తమ అనుబంధం విడిపోవద్దన్న ఆలోచనతో అక్కచెల్లెళ్ళను వివాహం చేసుకుని, రెండు కుటుంబాలు ఎంతో అనురాగంలో ఉండేవి. విచిత్రంగా ఇద్దరూ ఒకే వ్యాధితో భాధపడుతూ ఒకే రోజున (ఫిబ్రవరి 22న) మరణించారు. బింబప్రతి
బింబాల మాదిరిగా ఉన్న ఈ కవలసోదరుల గౌరవార్థం ఆ నాటినుంచి ఆ కవలలు మరణించిన రోజునే కవలల దినోత్సవంగా జరుపుతున్నారు.పురుషుల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే శుక్ర కణం మహిళల్లోని అండంతో ఫలదీకరణం చెందడం వల్లే పునరుత్పత్తి జరుగుతుందని తెలుసు. ఐతే ఒక్కొసారి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. మహిళల్లో కొన్నిసార్లు రెండు అండాశయాల నుంచి రెండు అండాలు విడుదలైనప్పుడు వాటికి రెండు శుక్ర కణాలు జతకలిస్తే ఫలదీకరణ విభిన్నంగా ఉంటుంది. లేదా ఒకే అండం రెండు సార్లు విదళనం. చెందిన క్రమంలో కవల పిల్లలు జన్మిస్తారు. కవలలకు జన్మనివ్వడంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే.. ఒక వంశంలో పూర్వం ఎవరైనా కవలలకు జన్మనిచ్చి ఉంటే ఆ వంశంలోని వారికి ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులిద్దరి వంశాల్లో ‘ట్విన్స్ హిస్టరీ’ ఉంటే కవలలకు జన్మనిచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. ‘ట్విన్స్ జీన్స్’ ఉన్న మహిళలు.. 30 ఏళ్ల వయసు దాటాక గర్భం ధరిస్తే కవలలు జన్మించే అవకాశం ఎక్కువ. కానీ వాటిని గుర్తించడం కష్టం.

కవలలు రూపంలో ఒకేలా ఉన్నా….!

వారి ఫింగర్ ప్రింట్స్, కళ్లు మాత్రమే వేరేలా ఉంటాయి. కొంతమంది ట్విన్స్ ముఖ కవలికలు ఒకేలా ఉన్నా శారీరక బరువు వేర్వేరుగా ఉంటుంది. కవలల ఆకృతి మాత్రమే ఒకేలా ఉన్నావారి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొందరు ట్విన్స్‌లో ఒకరు ఆరోగ్యంగా ఉంటే మరొకరు బలహీనంగా ఉండవచ్చు. అలాగే ఇద్దరిలో రోగ నిరోధక శక్తుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతరులు కవల పిల్లలను ఎలాగైతే గుర్తించలేకపోతారో, వారి తల్లిదండ్రులు కూడా కొన్ని సార్లు తికమక పడుతుంటారు. ఎందుకంటే ప్రతి ఆరునెలల
కొకసారి శరీర రూపం మారుతుంది.చదువు విషయంలోనూ ఏడాదికి ఒక్కొక్కరు ఒకసారి ముందుండటం చూసి ఆశ్చర్యానికి గురౌతుంటారు. శరీరాలు అతుక్కుని జన్మించే పిల్లలను సయామీ కవలలు అంటారు.

ఇద్దరు కవలలు జన్మించడం సాధారణమే కానీ..!

ముగ్గరు నుంచి ఏడుగురి వరకు జన్మించడం అత్యంత అరుదుగా జరుగుతుంది. కవల పిల్లలకు జన్మినిచ్చే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని ఓ అధ్యయనం ద్వారా తేలింది. ఒకసారి కవలలకు జన్మినిచ్చిన మహిళకు మరో కాన్పులో కూడా కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు వైద్యనిపుణులు. ప్రతి పన్నెండు మంది మహిళల్లో ఒకరికి ఈ అవకాశం ఉండవచ్చు. అయితే తొలిసారి జన్మించే కవలలు ఒకేలా ఉన్నప్పటికీ రెండోసారి కాన్పులో జన్మించిన ట్విన్స్ వేర్వేరు రూపాల్లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయట. ఏదేమైనా కవలల యొక్క సమరూపకత, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఐకమత్యం వంటి లక్షణాలు అందరిలో ఉంటే ఎంత బావుండు.

Leave A Reply

Your email address will not be published.