Take a fresh look at your lifestyle.

శ్రీరాంపూర్‌లో ఐఎన్టీయూసీకి కొత్త నాయకత్వ బలోపేతం : డా. బి. జనక్‌ ప్రసాద్‌.

0 2

శ్రీరాంపూర్‌లో ఐఎన్టీయూసీకి కొత్త నాయకత్వ బలోపేతం.
ముగ్గురికి వైస్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు. కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: డా. బి. జనక్‌ ప్రసాద్‌.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 26: సింగరేణి శ్రీరాంపూర్‌ ఏరియాలో ఐఎన్టీయూసీని మరింత పటిష్టం చేసి, కార్మిక సమస్యల పరిష్కారానికి విస్తృతంగా ఉద్యమాలు చేపట్టాలని ఆ సంఘం సెక్రటరీ జనరల్‌ డా. బి. జనక్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. స్థానిక సీసీసీ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్‌ ఏరియా ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఏరియాలో యూనియన్‌ కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా ముగ్గురు నాయకులను వైస్‌ ప్రెసిడెంట్లుగా నియమించారు. జీఎం కార్యాలయానికి చెందిన స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ చాట్ల అశోక్‌, ఆర్కేఎన్‌టీ హెడ్‌ ఓవర్‌మెన్‌ ల్యాగల శ్రీనివాస్‌, ఎస్‌ఆర్‌పీ ఓసీ ఈపీ ఆపరేటర్‌ శీలం చిన్నయ్యలకు ఈ బాధ్యతలు అప్పగించారు. నూతనంగా నియమితులైన వారిని నాయకులు పరిచయం చేసి అభినందనలు తెలిపారు. అనంతరం శ్రీరాంపూర్‌ ఏరియాలో ఐఎన్టీయూసీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్మికుల సమస్యలను గుర్తించి పరిష్కరించడం, యూనియన్‌ కార్యకలాపాలను విస్తృతం చేయడం, రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికలకు అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా డా. బి. జనక్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఈ నెల 28న ఐఎన్టీయూసీ నాయకులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం కానున్నట్లు తెలిపారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్తుతో పాటు కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన వైద్య సదుపాయాలు, హక్కుల పరిరక్షణకు తమ సంఘం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కార్మికుల ప్రధాన సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో ప్రతి కార్మికుడికి ఐఎన్టీయూసీ అండగా నిలుస్తుందని చెప్పారు. సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెట్టి శంకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, జనరల్‌ సెక్రటరీలు వికాస్‌ కుమార్‌ యాదవ్‌, ఏనుగు రవీంద్రరెడ్డి, జీవన్‌ జోయల్‌, చీఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నరేందర్‌, మంచిర్యాల జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా అధ్యక్షురాలు శేషారత్నం, సెక్రటరీ లలిత, సెంట్రల్‌ నాయకులు భీంరావు, తిరుపతిరాజు, గరిగే స్వామి, పేరం రమేష్‌, చందు, పిట్‌ సెక్రటరీలు, శ్రీరాంపూర్‌ ఏరియా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.