Take a fresh look at your lifestyle.

ట్రేమిస్ కళాశాలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు…..

0 1,719

ట్రేమిస్ కళాశాలను సందర్శించిన కాంగ్రెస్ నేతలు

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 19 (లోకంతీరు ) : కోటగిరి మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ కి సంభందించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ ముబీన్ హైమద్ కి వారు అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా కళాశాలలోని విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలు అలాగే కళాశాల పరిశుభ్రత లను వారు పరిశీలించారు. విద్యార్థులకు అనువుగా కళాశాలలో గదులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామ ని ముబీన్ హైమద్ మైనారిటీ నాయకులను తెలియజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు టేమ్రీస్ చీఫ్ సెక్రటరీ ఆయేషా ఖానం కి ఫోన్లో సంభాషించి కళాశాల పరిస్థితుల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ కార్యదర్శి వహీద్,మైనార్టీ నాయకులు అయ్యుబ్ హైమద్,యాహియ ఖాన్, జుబెర్ ఖాన్,షేక్ లాయక్, సయ్యద్ హైమద్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.