అర్హులైన ప్రతి గౌడ, గీత కార్మికుల లైసెన్స్ లు ఇవ్వాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి

కామారెడ్డి జిల్లా , మార్చి 14 ( లోకంతీరు ) :అర్హులైన ప్రతి గీత కార్మికుడికి గీత కార్మిక లైసెన్స్ ఇవ్వాలని జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజుకు గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మిక వృత్తిని నమ్ముకొని చాలా పేద కుటుంబాలు జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. చాలామంది గౌడ కులస్తులకు గీతా కార్మిక లైసెన్సులు లేవని కావున అర్హులైన వారిని గుర్తించి గీతా కార్మికుల లైసెన్సులు జారీ చేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, నాయకులు మొగుళ్ళ రామా గౌడ్, ఇందూరి సిద్ధ గౌడ్, సుక్క రవి గౌడ్, సుక్క నవీన్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.