ఉన్నత పాఠశాల విద్యార్థులకు “ఉత్తమ ప్రతిభ” పురస్కారాలు
ముప్కాల్ , జనవరి 27 ( లోకం తీరు ) : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముప్కాల్ మరియు బాల్కొండ రోటరీ క్లబ్ ఫ్రెండ్లీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు గోల్డ్ మెడలను స్థానిక పోలీస్ కవి ఏ ఎస్ ఐ తొగర్ల సురేష్ సొంత ఖర్చుతో అందజేశారు. విద్యార్థిని విద్యార్థులలో ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని మరియు రోడ్డు భద్రత అవగాహన అంశాలపై నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు.పాఠశాలలోని ఉత్తమ విద్యార్థులకు సైతం వివిధ అంశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై భాస్కరాచారి బహుమతులను అందజేశారు సమాజంలో మంచి ప్రేరణతో విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఏఎస్ఐ సురేష్ ను ఎస్సై భాస్కరాచారి మరియు గ్రామ సర్పంచ్ ఎంపీపీ జడ్పిటిసి ఉపాధ్యాయ బృందం అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ విద్యార్థులను మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు పురస్కారాలు తోడ్పడతాయని సమాజంలో అద్భుతమైన వ్యక్తులుగా రూపొందించే అవకాశంలో తమకు ఒక భాగం లభించడం చాలా సంతోషంగా భావిస్తున్నానని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారం పాఠశాల అభివృద్ధి కమిటీ మరియు ఎస్సై భాస్కరాచారి జడ్పిటిసి బద్దం నరసవ్వ నర్సారెడ్డి రెడ్డి సర్పంచ్ ఎంపీపీ పద్మా వెంకటరెడ్డి రోటరీ క్లబ్ సభ్యులు చాకు లింగం ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
