Take a fresh look at your lifestyle.

పట్టించుకోని నాథుడే లేడు – విసిగిపోయిన కొనుగోలుదారుడు…

0 1,475

కాసులు పెట్టి కొన్న…….  కడుపు నింపని భూవివాదం

  • పట్టించుకోని నాథుడే లేడు – విసిగిపోయిన కొనుగోలుదారుడు

బాల్కొండ  , ఫిబ్రవరి 27 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం రెండు ఎకరాల భూమి కోనేరు బాలగంగాధర్ కొనుగోలు చేయగా అట్టి భూమిని సాగు చేయనీయకుండా గ్రామ అభివృద్ధి కమిటీ అడ్డుపడుతుందని మంగళవారం రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తన వద్ద ఉన్న భూమి కొనుగోలు చేసిన పత్రాలను పట్టా కాగితాలు అన్ని సాక్షాధారాలతో తహసిల్దారు అధికారికి చూపించి తమకు న్యాయం చేయాలని కోరారు ఇదిలా ఉండగా గత సోమవారం నాడు సికింద్రాపూర్ గ్రామ కమిటీ గ్రామ ప్రజలు తహసిల్దారు కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని కోనేరు బాలగంగాధర్ అలాగే తాను కొన్న భూమిలో హద్దురాల్లను తొలగించి ఆస్తి నష్టం కలిగించిన వారిని శిక్షించి తమకు న్యాయం చేయాలని స్థానిక తహసీల్దార్ మరియు పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.