బస్సులు ఆపాలని డీఎంకు వినతి పత్రం అందజేత
కామారెడ్డి జిల్లా / రాజంపేట, సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో న్యూ బీసీ కాలనీ (ఎల్లమ్మ ఆలయం) వద్ద కామారెడ్డి నుండి గుండారం వైపు వెళ్లే బస్సులు ఆపాలని కోరుతూ రాజంపేట మండల కేంద్రానికి చెందిన న్యూ బీసీ కాలనీ ప్రజలు సోమవారం కామారెడ్డి డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. గత కొంతకాలంగా న్యూ బీసీ కాలనీ వద్ద బస్సులు ఆపడం లేదని, దీంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్ లో బస్సులు ఆపడం వల్ల సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలనీకి నడవాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే తమకు న్యూ బీసీ కాలనీ వద్ద బస్సులు ఆపే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిరాకు, సీఐ లింగమూర్తికి విన్నవించారు. దీంతో అధికారుల స్పందిస్తూ రేపటి నుండి బస్సులు ఆపే విధంగా డ్రైవర్ కండక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ బస్సులు ఆపకపోతే రోడ్డుపై బైఠాయించి తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
– ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తరలిన కాలనీవాసులు
రాజంపేట మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీకి చెందిన ప్రజలు తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. కాలనీలో నీటి సమస్య, సిసి రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నామని, అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీంతో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి త్వరలోనే సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని క్యాంపు కార్యాలయ సిబ్బంది హామీ ఇచ్చారు.