Take a fresh look at your lifestyle.

మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేత

0 1,357

మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేత

  • నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.
  • ఎన్.ఎం.ఆర్ కార్మికులకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్

నిజామాబాద్, జనవరి 31 ( లోకం తీరు ) : IFTU CITU, AITUC మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ల ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా CITU, IFTU, AITUC సంఘాల బాధ్యులు ఏ.రమేష్ బాబు, ఎం.సుధాకర్, పి.నర్సింగ్ రావు లు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలియజేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలకులు మున్సిపల్ కార్మికులను సత్కరిస్తూ, శాలువాలు కప్పి పొగడ్తల్లో ముంచెత్తుతున్నారే తప్ప, వారికి తగిన విధంగా జీతాలు పెంచలేదని ఆరోపించారు. ఏపీలో మున్సిపల్ కార్మికులకు నెలకు 21000/-, ఇతర అలివేన్సులతో ఐదు వేలు మొత్తం కలిపి 26,000/- చెల్లిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం 15600/- మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. 

కాంట్రాక్ట్,  ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఎన్.ఎం.ఆర్ కార్మికులకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ వర్కర్లకు ఇస్తున్న సౌకర్యాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా కల్పించాలన్నారు. ఫిబ్రవరి 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ల నాయకులు కే.భూపతి, డి.కిరణ్, హన్మoడ్లు, మదారి, యశ్వంత్, భూమయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.