కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలి
— అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపై ఉన్నారు.
— ఒక్క స్థానం వదలకుండా 49 వార్డుల్లో బీజేపీ విజయం సాధించే విధంగా పని చేద్దాం
— కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి ,నవంబర్ 2 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్ అధ్యక్షతన పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలనీ అందుకు ప్రతి కార్యకర్త కంకణ బద్దులై పని చేయాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపై అన్నారనీ వారికి అందుబాటులో ఉండి వార్ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. ఒక్క స్థానం వదలకుండా 49 వార్డుల్లో బీజేపీ విజయం సాధించే విధంగా పని చేద్దామని అన్నారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.