రామారెడ్డి లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

రామారెడ్డి , అక్టోబర్ 15 ( లోకంతీరు ) : మండల కేంద్రంలో మంగళవారం రామారెడ్డి గ్రామంలోని పాడి పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డా. శ్రీనివాస్ స్థానిక పశు వైద్యశాలలో ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. శ్రీనివాస్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పాడి పశువులలో వచ్చే అతి ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటి దానికి నివారనే మార్గమని సూచించారు. ఈ కార్యక్రమం 15 నుండి వచ్చేనెల 14 తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని పాడి రైతులందరూ వినియోగించుకొని తమ తమ పాడి పశువులకు దూడలకు తప్పకుండా టీకాలు ఇప్పించుకోవాలని సూచించారు. మండల పశువైద్యాధికారి డా. రామచందర్ మాట్లాడుతూ నిర్వహించిన టీకాల కార్యక్రమంలో గ్రామంలోని 228 పశువులకు మరియు దూడలకు ఉచిత టీకాలు ఇచ్చినట్లు, 45 మంది పాడి రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డా. సంజయ్ కుమార్ విఎల్,వో శ్రీనివాసరావు, జేవివో నారాయణ, పశువైద్య సహాయకుడు రమేష్, ఆంజనేయులు, బాలమని, రవీందర్ లు పాల్గొన్నారు.