వెదజల్లే పద్ధతిలో వరి సాగుతో అధిక లాభాలు

బాల్కొండ, ఫిబ్రవరి 01( లోకం తీరు ) : బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో వెదజల్లే పద్ధతిలో సాగుచేసిన వరి పంటను పరిశీలించి యాసంగి వరి పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను గురించి రైతులకు వివరించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1.వెదజల్లే పద్ధతిలో ఒక వ్యక్తి ఒక రోజులో 4 ఎకరాల వరకు విత్తనాన్ని వెదజల్లి వరిని సాగు చేసుకొనవచ్చు కావున ఈ పద్ధతిలో సాగు చేయడం వలన కూలీల కొరతను అధిగమించవచ్చు,
2. నారుమడి యజమాన్యం మరియు నాట్లు వేయడానికి అవసరమయ్యే ఖర్చులు సుమారుగా ఐదు నుంచి 8 వేల రూపాయలను ఆదా చేసుకొనవచ్చు
3. 10 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది కావున విత్తన ఖర్చును కూడా ఆదా చేసుకొనవచ్చు,
4. ఈ పద్ధతిలో సాగు చేసిన వరి 10 నుంచి 15 రోజుల ముందుగానే కోతకు రావడం జరుగుతుంది కావున నీటిని పొదుపు చేసుకొనవచ్చు,
5. ఈ పద్ధతిలో కలుపు యజమాన్యం విత్తనాన్ని వెదజల్లిన 48 గంటల్లోపు ఒకసారి మరియు విత్తిన 15 నుంచి 25 రోజుల్లోపు ఒకసారి గడ్డి మందును పిచికారి చేసుకుని కలుపును నియంత్రించుకోవాలి,
5. యాసంగి వరి సాగులో ప్రధానంగా జింకు లోపం ఏర్పడుతుంది కావున రైతులు గమనించిన వెంటనే రెండు గ్రాముల జింకు సల్ఫేట్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారి చేయాలి,
6. మొగి పురుగు కాండం తొలుచు పురుగు నివారణ కొరకు రైతులుకారటప్ హైడ్రా క్లోరైడ్ ప్లస్ ఇమామెక్టిన్ బెంజైట్ లేదా క్లోరాంతర నీలిప్రోలు గుళికలు వాడుకొని నియంత్రించుకోవాలి అని సూచించారు,
ఈ కార్యక్రమంలో ఏఈఓ నిహారిక, రైతులు పాల్గొన్నారు.