Take a fresh look at your lifestyle.

రాబోయే స్థానిక ఎన్నికలకు బంజారాలకు స్థానం కల్పించాలి….

0 1,258

రాబోయే స్థానిక ఎన్నికలకు బంజారాలకు స్థానం కల్పించాలి

కామారెడ్డి జిల్లా , సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : హైదరాబాద్ గాంధీభవన్ లో ఆదివాసి కాంగ్రెస్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసి చైర్మన్ బేల్లయ్య నాయక్ సమావేశం ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా లు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తోడ్పాటు చేశారని వారన్నారు. రాబోయే ఎన్నికలలో జనరల్ స్థానాల్లో కూడా బంజారాలకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బంజారాలు అధికారికంగా ఆర్థికంగా ముందుండాలని చెప్పారు. ఈ సమావేశానికి 33 జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ బంజారాలకు ఏ విధంగా అయినా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా బంజారా ఆర్థిక స్థితిగతులకు తోడ్పాటు ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాణా ప్రతాప్, ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు మదన్ లాల్,  బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.