Take a fresh look at your lifestyle.

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి….

0 1,151

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి

– కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో స్పోక్స్ పర్సన్ డాక్టర్ విద్యాసాగర్

ఎల్లారెడ్డి, నవంబర్ 0 2 ( లోకంతీరు ) : మెదక్, నిజమాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం,డిగ్రీ పూర్తి చేసి అర్హులైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో స్పాక్స్ పర్సన్ డాక్టర్ విద్యాసాగర్ కోరారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తో కలసి మాట్లాడుతూ…ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైనదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు ద్వారా సమర్థులైన అభ్యర్థిని ఎన్నుకోవడానికి సరియైన అవకాశం వచ్చిందని, ఇందుకోసం అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ సమర్థవంతంగా పరి పాలన చేస్తుందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేయడానికి టికెట్ కోసం ఆశిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరికీ టికెట్ ఇచ్చిన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ విద్యాసాగర్ తో పాటు, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, అధ్యాపకులు పీవీ.నరసింహ, అక్కం విష్ణు, కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, విశ్రాంత పిఈటి ఆకుల కిష్టయ్య, పద్మ పండరి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ను కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం తరపున అధ్యాపకులు పీవీ.నరసింహ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వారు స్థానిక మోడల్ స్కూల్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కోసం అర్హులైన పట్టభద్రుల ఓటు హక్కును నమోదు చేసుకునేలా ప్రిన్సిపాల్ ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.