Take a fresh look at your lifestyle.

స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ట….

0 1,809

స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ట.

 

రామారెడ్డి (లోకం తీరు, ఫిబ్రవరి 2) : 

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, రామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ జి,విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడు తు రామారెడ్డి లో యువత స్వామి వివేకానంద సూక్తులు విని స్వామివారి బాటలో పయనించాలని సూచించడం జరిగింది.అదేవిధంగా చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గం వైపు ఉండాలని సూచించడం జరిగింది. భారత దేశ ఔన్నత్యాన్ని కీర్తించడం జరిగింది.నేటి బాలలే భావి భారత పౌరులై భారతమాత యొక్క రుణాన్ని తీర్చుకోవాలని సూచించడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను నాలుగు సూక్తులు చెప్పడం జరిగింది. తదుపరి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతా ఉప అధ్యక్షులు డాక్టర్ రాoసింగ్, రంజిత్ మోహన్, ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వీహెచ్పీ జిల్లా అధ్యక్షులు గోపాల కృష్ణ, విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తుమ్మల కృష్ణ,విగ్రహ దాత చరిత శ్రీ యూత్ అధ్యక్షులు దండబోయిన సంజీవ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు అమ్ముల శ్రీనివాస్,విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి శాఖ అధ్యక్షులు పటెండ్ల రమేష్ రెడ్డి, ఎంపిటిసి

రజిత రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ నూనె భాగ్యలక్ష్మి శ్యాంసుందర్, దండబోయిన గంగాధర్, భూపతి శ్రీనివాస్ బోలుగం శ్రీనివాస్, బత్తిని శ్రీకాంత్, ఉస్కే రాజేందర్, బండకింది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.