జీవో నంబర్ 55 వెంటనే రద్దు చేయాలి
- ఎబివిపి తెలంగాణ యూనివర్సిటీ

నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) : తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి నాగరాజు మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని జీవో నంబర్ 55ను గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. తెలంగాణలో ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. ఈ వ్యవసాయ యూనివర్సిటీ సమాజానికి ఉపయోగపడే వినిత పరిశోధనలు జరుగుతున్న ప్రదేశం కాబట్టి జీవో నెంబర్ 55ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ విద్యార్థి వ్యతిరేక ప్రకృతి వ్యతిరేక తెలంగాణ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని విధాలుగా పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏ ప్రభుత్వం వచ్చినా విశ్వవిద్యాలయాల భూముల పై అక్రమాలు చేయడం ప్రభుత్వాలకు ఏ విధంగా సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల యొక్క అభివృద్ధి సమాజం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి అని చెప్పిన ప్రొఫెసర్ జయశంకర్ , కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి సామాజిక కార్యకర్తలు విశ్వవిద్యాలయాల అభ్యున్నతి కోసం భూమి అనేది ఎంత ముఖ్యమో, దాని ద్వారా సమాజంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు చేయాలని పరితపించారు.గత బి.ఆర్.ఎస్ పరిపాలనలో యూనివర్సిటీ పూర్తిగా నిర్వీర్యమైన విషయం తెలిసిందే, గత ప్రభుత్వంలో విద్యార్థులకు జరిగిన అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థి లోకం ఏకమై విద్యావ్యవస్థ బాగుపడి ఉపాధి కల్పన జరుగుతుందని ఆశతో నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల గడవకముందే ఈ విధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు యొక్క నూతన భవనానికి కేటాయిస్తే విద్యార్థుల జీవితాలను, యూనివర్సిటీలను అంధకారంలోకి నెట్టి వేయడమే అన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలకు కాకుండా ఇతర సంస్థలకు భూమిని కేటాయించలేదని ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు ఈ విధంగా విద్యార్థులకు మరియు వ్యవసాయ రంగానికి అన్యాయం చేసే దిశగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క 100 ఎకరాలలో హైకోర్టు నిర్మిస్తే బయోడైవర్సిటీ పార్కులో ఉన్న జీవ వైవిద్యము కోల్పోతామని, ఇక్కడ దాదాపు 350 కి పైగా పక్షులు మరియు జంతువులు, 450 కి పైగా వృక్ష జాతులు, వృక్ష ఔషధ జాతులు 80, తిగ జాతులు 30 ఉన్నాయని వీటన్నిటిని సంరక్షిస్తూ బయోడైవర్సిటీ పార్కు చేయడానికి 25 సంవత్సరాల కృషి ఉందని అన్నారు. దేశంలో అంతరించిపోతున్న 5 జాతులలో నాలుగు జాతులు ఇక్కడే ఉన్నాయి మరియు ఆ స్థానంలో రెండు లక్షల చెట్లు ఉన్నాయి ఒక్కో చెట్టు విలువ జీవితకాలం ఇచ్చే ఎకనామిక్ బెనిఫిట్ 32 లక్షలు ఉంటుంది. మొత్తం ఈ యూనివర్సిటీలో ఆరు లక్షల చెట్లు ఉంటాయి ఈ యూనివర్సిటీ ని *లంగ్స్ ఆఫ్ హైదరాబాద్* గా పిలుస్తారు ఈ లెక్కన ఇది కొన్ని కోట్ల వృక్ష సంపద హైదరాబాద్ ఉష్ణోగ్రతకి రాజేంద్రనగర్ ఉష్ణోగ్రతకి రెండు డిగ్రీల తేడా ఉంటుంది. పంట తెగులు నిర్వహణ కూడా ఇక్కడున్న జీవవైవిద్యం వలన తీగ మొక్కలను గుర్తించి పెస్ట్ మేనేజ్మెంట్ అయ్యేవిధంగా ఎన్నో పరిశోధనలు చేసి సేవలందిస్తుంది అన్నారు. ఈ యూనివర్సిటీని డిస్టర్బ్ చేస్తే పరిశోధనలపై చాలా ప్రమాదం ఉంటుందని, వ్యవసాయ రంగానికి సరైన దిశా నిర్దేశం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కావున వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు చేయాలి తప్ప అదినాతనమైన రీసెర్చ్లు చేసి వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చే పరిశోధనలకు ఆటంకం కలిగించి భవిష్యత్ భావితరాలకు అన్యాయం చేయొద్దని, ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయం మార్చుకోవాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేసి జీవో రద్దయ్యే వరకు ఏబీవీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని కార్యచరణ రూపొందించి యూనివర్సిటీలో గుంట భూమి కూడా వదలమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ABVP హెచ్చరిస్తుందని అన్నరు.
ఈ కార్యక్రమంలో అమృత్ చారి,సింహాద్రి, సచిన్, మహర్షి, మహేష్, శివ, అక్షయ్, సమీర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు*