భారీ ర్యాలీ, బహిరంగ సభల జయప్రదంకై వేలాదిగా తరలిరండి
- IFTU పిలుపు
![]()
నిజామాబాద్ అర్బన్ , ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదంకై వేలాదిగా కార్మికులు తల్లి రావాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదంకై బీడీ కార్మికులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశ ప్రజలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిన మేలేమీ లేదన్నారు. ఎన్నోఏళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తూ 04 కార్మిక వ్యతిరేక కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిందన్నారు. ముఖ్యంగా బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ – మతతత్వ విధానాలను ప్రతిఘటించాలన్నారు.
మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ ప్రకటిద్దామన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ కు దేశవ్యాప్త కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. అందులో భాగంగా ఈనెల 16న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ ర్యాలీ బహిరంగ సభలను జిల్లాలోని వేలాది కార్మికులు, ముఖ్యంగా బీడీ కార్మికులు, రైతులు, రైతు కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, నాయకులు కే.గంగాధర్, డి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
