Take a fresh look at your lifestyle.

చదువే ఆయుధం….

0 1,462

చదువే ఆయుధం

– ఇంటర్ విద్య అధికారి రవికుమార్
ఉల్లాసంగా …. ఉత్సాహంగా…

– బాలికల జూనియర్ కళాశాలలో
ఫ్రెషర్స్ పార్టీ

నిజామాబాదు, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : విద్యార్థినులకు చదువే ఆయుధమని దాంతో దేనినైనా జయించవచ్చు అని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమల పూడి రవికుమార్ అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో గాను మొదటి సంవారంలో చేరిన నూతన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు గాను ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ బుద్దిరాజ్ అధ్యక్షత వహించగా జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ రవికుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోనే మంచి ఫలితాలు సాధించే పేరున్న బాలికల జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి గాను మరింత ఉత్సాహంగా చదువుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు మంచి విద్యాబోధన చేస్తున్న అధ్యాపకుల బృందాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కళాశాలలో
ఉర్దూ మీడియం, తెలుగు మీడియం,ఇంగ్లీష్ మీడియం, ఒకేషనల్ గ్రూపులలో సుమారు 1200 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని, ప్రిన్సిపాల్ శ్రీ బుద్ధిరాజ్ ఆధ్వర్యంలో కళాశాల మరింత అభ్యున్నతికి చేరుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. అధ్యాపకులు, సిబ్బంది శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. కళాశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలను, పరికరాలను, లైబ్రరీ ప్రతి విద్యార్థిని వినియోగించుకొని మంచి పరిజ్ఞానాన్ని సంపాదించాలని ఉద్బోధించారు.
ప్రిన్సిపల్ శ్రీ బుద్దిరాజ్ మాట్లాడుతూ ఇంటర్ విద్య విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండాలని నిర్ణయిస్తుందని అందుకే ఈ కళాశాల స్థాయిలోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ప్రతి అంశాన్ని, విషయాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఎల్లవేళలా అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన చదువుతో పాటు నృత్యాలు, పాటలు, క్రీడలు అదే స్థాయిలో అవసరమని అన్నారు.

జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షులు ఐలాపూర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఏ. చిన్నయ్య నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఖాలిక్, ఆర్మూర్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ విజయానంద రెడ్డి, భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిప ల్ శ్రీ జైపాల్ రెడ్డి, నిజామాబాద్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు శ్రీ నరసయ్య, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.