ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి /బిక్కనూర్ ,ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూరు మండలం అంబేద్కర్ కాలనిలో ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి యేమియా అన్నారు. మండల కేంద్రంలోని పట్టణంలోని అంబేద్కర్ కాలనిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు శిబిరానికి వచ్చి పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి కావాల్సిన మందులు ఉచితంగా అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విష జ్వరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.