ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?
-
సర్కార్ బడులలో సౌకర్యలు నిల్.
-
మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ నాయకుల డిమాండ్.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : సర్కార్ బడులలో ప్రమాదం జరిగితేనే అధికారుల స్పందిస్తారా అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ కాలనిలో గల శిథిలా వ్యవస్థకు చేరిన ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించారు, ఈ సందర్భంగా ఆయనా మాట్లాడుతూ…. తాసిల్దార్ కార్యాలయానికి కూత వేట దూరంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలా వ్యవస్థకు చేరుకున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా తరగతి గదులు సరిపోక శిథిలా వ్యవస్థకు చేరుకున్న 1981లో నిర్మించిన పురాతన మహిళా మండలి భవనంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుగా పనిచేయడంతో రాష్ట్రంలో ఉన్న 26 వేల సర్కారు బడులలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం విఫలమయ్యారని ఆయన అన్నారు. కొత్తగా కొలువు ధీరిన ప్రభుత్వం అయినా ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని మౌలిక సదుపాయాలు కల్పించి పేద మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైనా విద్యను అందించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రమాదాలు జరిగేంత వరకు వేచి చూడకుండా రాష్ట్రంలో శిథిల వ్యవస్థకు చేరిన పాఠశాలల్లోని తరగతులను కూల్చివేసి వేసి వాటి స్థానాలలో కొత్త తరగతి గదిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జడ్పీ హైస్కూల్లోని విద్యార్థులకు అందిస్తున్న మిడ్ డే మీల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిపిఐ నాయకులు ఓమయ్య, దుబాస్ రాములు, విఠల్ గౌడ్, నల్ల గంగాధర్, బర్ల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.