ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో ఆల్ ఇన్ వన్ పేపర్ల పంపిణీ.


భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : భీంగల్ పట్టణ కేంద్రంలో బుధవారం ఆల్ ఇండియా మజిలీస్ ఇత్యహాద్ ముస్లిమీన్ అధ్యక్షుడు బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ, అలాగే నిజాంబాద్ జిల్లా ఇన్చార్జ్ శాసనసభ సభ్యుడు అహ్మద్ బిలాల్ ఆదేశాల మేరకు భీంగల్ మండల మజిలీస్ ఇత్యహార్ ముస్లిం అధ్యక్షుడు ఆఫీస్ మొహసిన్ భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియం చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు సాలార్ మిల్లర్ ఆల్ ఇన్ వన్ మోడల్ పేపర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీంగల్ మజిలీస్ అధ్యక్షులు ఆఫీస్ మహాసేన్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులతో విజయం సాధించి ప్రభుత్వ ఉర్దూ పాఠశాల పేరును తెలంగాణ రాష్ట్రంలోనే విజేతగా నిలబెట్టాలని పిల్లలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేందర్. ముజాబుద్దీన్, సయ్యద్ అజ్మత్, తో పాటు పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.