తిమ్మారెడ్డి వైపు వెళ్లే వాళ్లు కళ్యాణి వాగు దాటిపోవద్దు
– ఎస్సై మహేష్ సూచన

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పిల్లాడి మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎల్లారెడ్డి మండల పరిధిలోని తిమ్మారెడ్డి వైపు వెళ్లే కళ్యాణి కళ్యాణి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాగును పరిశీలించి రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. ప్రజలు వాహనదారు అటు వెళ్లకుండా రాకపోకులకు కంచే ఏర్పాటు చేశారు. రెండు వైపులా ప్రజలు వాగు దాటేందుకు ప్రయత్నం చేయొద్దని సూచించారు.తిమ్మారెడ్డి, వెల్లుట్ల, వెల్లుట్లపేట గ్రామాలకు వెళ్లేవాళ్లు అన్న సాగర్ గ్రామం మీదుగా వెళ్లాలని ప్రజలకు వాహనదారులకు కోరారు. ఎస్ఐ వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.