గ్రామ పంచాయతీ కార్మికుల ముందస్తు అరెస్టు
కామారెడ్డి జిల్లా, జూలై 30 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికులను ముందస్తుగా మంగళవారం రాజంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అరెస్ట్ చేసారు. నేడు చలో హైదరాబాద్ ముట్టడిలో భాగంగా రాజంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని 18 గ్రామ పంచాయతీల 60 మంది గ్రామ పంచాయతీ కార్మికులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో నిర్బంచారు. జిపి కార్మికులకు సరియైన భీమా భద్రత, జీతాలు అందించాలని వారు నేడు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు.