Take a fresh look at your lifestyle.

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే బాగుంటుంది.

0 1,880

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే బాగుంటుంది.

  • దూషణలే చేస్తామంటే ప్రతి దూషణలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం.
  • ఫ్రోటోకాల్ గురించి పోచారం మాట్లాడడం విడ్డూరంగా ఉంది….కొట్టం మనోహర్

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) :-విలువలతో కూడిన సాంప్రదాయ రాజకీయాలను ప్రోత్సహిస్తే బాగుంటది,కాదు కూడదు అని దూషణలు చేస్తే ప్రతి దూషణలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని డిసిసి డెలిగేట్ సభ్యులు కోటగిరి ఎంపిటిసి కొట్టం మనోహర్,నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ.ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పోచారం భాస్కర్ రెడ్డి మా నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డినీ గాడు గీడు అనడం సిగ్గుచేటని.డీసీసీబీ చైర్మన్ హోదాను మరచిపోయిన పోచారం భాస్కర్ రెడ్డి అపరిస్కృత పదజాలాలతో మాట్లాడటం సబబు కాదన్నారు.8 సం.లుగా ఎమ్మెల్యే చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పరువును కార్యకర్తలు కాకుండా కొడుకుగా మీరే పరువు తీస్తున్నారని అన్నారు.మాకు నోరు ఉంది సభ్యత మరోచితే మేము కూడా మీకంటే గొప్పగా దుషించగలుగుతామన్నారు. ముందు మీ డీసీసీబీ బ్యాంకు లో జరిగిన కుంభ కోణాలను సరిచేసుకోవాల ఆయన ఆరోపించారు. ప్రోటోకాల్ గురించి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.ఉమ్మడి కోటగిరి మండలంలో 14 మంది ఎంపీటీసీలు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 ఎంపీటీసీలకు 5 లక్షల ఫండ్స్ ఇవ్వకుండా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధు లను గౌరవించకుండా నేడు ప్రోటోకాల్ గుర్తుకు వస్తుందా అనీ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమైనా జరిగితే ఊరుకొమని పోచారం శ్రీనివాస్ రెడ్డి వాఖ్యనించడం సరైనది కాదని.గొడవలు పెట్టుకునే సంస్కృ తి కాంగ్రెస్ పార్టీకి లేదని.బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మా కుటుంబ సభ్యులే నని.మీ కుమారుల్లాగా విభజించి పాలించి,గొడవల వాతావరణ సృష్టించి,కేసులు పెట్టించే నీచ సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్,కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు ఆనంద్,కోటగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆఫ్జల్,సుంకిని హనుమంతు,మక్బుల్,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.