Take a fresh look at your lifestyle.

రైతును రాజు చేయడం ప్రభుత్వ లక్ష్యం….

0 1,212

రైతును రాజు చేయడం ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి జిల్లా,  జూలై 26 ( లోకంతీరు )జిల్లాలోని రాజంపేట మండలంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతును రాజుగా చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, గురువారం బడ్జెట్ సమావేశంలో రైతులకు పెద్ద ఎత్తున బడ్జెట్ 72,659 కోట్లు కేటాయించడం సంతోషకరమైన విషయం అని అన్నారు. రైతులకు బడ్జెట్ కేటాయించడంతో రైతులు ఆనందంలో ఉన్నారని రైతులకు రైతు రుణమాఫీ, రైతు భీమా చేయడం రైతులు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని వారన్నారు. రాజంపేట మండలంలో కొండాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విన్నవించిన ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో వైద్య ఆరోగ్య శాఖ పి హెచ్ సి నుంచి నిధుల గురించి వివరించడం జరిగిందని, ముందు పి హెచ్ సి పనులు కూడా అతి త్వరలో అయిపోతుందన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి వర్గానికి మరింత అభివృద్ధి పనులు సాగుతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, డివిజన్ అధ్యక్షులు మదన్, మండల ఉపాధ్యక్షులు మశేట్టి శ్రీధర్, బన్సీలాల్, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.