Take a fresh look at your lifestyle.

ఓటింగ్ శాతం పెరిగే విధంగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలి….

0 124

ఓటింగ్ శాతం పెరిగే విధంగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలి

– కలెక్టర్ జితేశ్వి పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యకలాపాలు చేపట్టవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఓటర్ హెల్ప్ లైన్ తో పాటు ఓటర్ సర్వీస్ పోర్టల్ లేదా ఆఫ్ లైన్ లో ఓటరు నమోదుకు పాఠశాల, కళాశాలల స్థాయిలో క్యాంపస్ అంబాసిడర్ల ద్వారా ప్రత్యేక చొరవ చూపాలని ఈ మేరకు క్యాంపస్ అంబాసిడర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. .భారత ఎన్నికల కమీషన్ స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిందని అందులో భాగంగా ఈ నెల 23 జిల్లాలో మూడు నియోజక వర్గాలలో క్యాంపస్ అంబాసిడర్లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని అన్నారు. మార్చి 1 న అన్ని పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలో మాక్ ప్లోలింగ్ నిర్వహించి విద్యార్థులకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్గించనున్నామన్నారు. మార్చ్ 7 రంగోలి, మెహేంది కార్యక్రమాల ద్వారా స్వయం సహాయక సంఘాలు, జిల్లా , మండల సమాఖ్య, సంఘాలకు తక్కువ ఓటింగ్ నమోదయితున్న పోలింగ్ బూతులల్లో ఓటింగ్ శతం పెంపుదలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. మార్చ్ 15 న గ్రామా, మునిసిపల్ స్థాయిలో పాఠాశాల, కళాశాల విద్యార్థులతో మానవహారం , మార్చి 22 న బూత్ స్థాయిలో ఓటింగ్ శాతం ;పెంపుదలపై సమావేశాలు, 23 న ప్రతి నియోజక వర్గంలో 5 కె రన్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మార్చి 28న నియోజక వర్గాలలో ఎంపిక చేసిన గోడలపై వాల్ గ్రాఫిటీ ఏర్పాటు చేస్తామని, ఇందుకు బాధ్యతలు కేటాయించిన అధికారులులందరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.