మురికి కాలువల పరిస్థితి….. పట్టించుకోని అధికారులు
బాల్కొండ, ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా మురికి కాలువల దుస్థితి చాలా దీనంగా ఉంది మురికి కాలువల చుట్టూ పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి కాలువలో నీరు పారకుండా వ్యర్థ పదార్థలు నిండిపోయాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.