Take a fresh look at your lifestyle.

పోలియో వ్యాధి శాశ్వతంగా నిర్మూలించాలి..!

0 1,358

పోలియో వ్యాధి శాశ్వతంగా నిర్మూలించాలి..!

– కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి
– జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
– జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 03 ( లోకంతీరు ) :  న్నారులకు చుక్కల మందు వేయడం వల్ల పోలియో వ్యాధి రాకుండా శాశ్వతంగా రక్షించుకోవచ్చునని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో రహిత దేశాన్ని నిర్మించాలని తెలిపారు. 0-5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. చిన్నారులకు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ. శతశాతం లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు సహకారం అందించాలని తెలిపారు. జిల్లాలో 1,02,555 మంది ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈనెల 4,5 వ తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు చుక్కల మందు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పారు. జిల్లాలో 733 పల్స్ పోలియో బృందాలు, 48 సంచార బృందాలను ఏర్పాటు ఏర్పాటు చేశారన్నారు.2,932 మంది ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, 69 మంది పర్యవేక్షణ అధికారులు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూ ప్రియ, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సుజాత, వైద్యులు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, రోటరీ క్లబ్ ప్రతినిధులు,ఎన్ సి సి వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.