గ్రామ పంచాయతీ అధికారుల సమయ పాలనలో నిర్లక్ష్యం

బాల్కొండ , ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధిత అధికారులు సమయ పాలనలో నిర్లక్ష్యం, గ్రామాలలోని గ్రామ పంచాయితీ అధికారులు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండాలి అలాంటి అధికారులు సమయపాలన నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఉదయం 09:00 కావస్తున్న అధికారులు జాడలేదు పై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అధికారులు తీరు ఇష్ట రాజ్యాంగ మారింది.సర్పంచుల పదవీకాలం ముగియడంతో అధికారుల ఇష్ట రాజ్యాంగ వ్యవహారిస్తున్నారు , ఎప్పుడు వచ్చినా సరే మేము వచ్చినప్పుడు పని చేయించుకోవాలి, అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. వారి పై అధికారులు స్పందించి సమయపాలన పట్టికను, ఎవరు ఏ సమయం వరకు ఉంటారో గ్రామపంచాయతీ ముందర ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది ఇలా ఉండగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం, మొక్కల పెంపకంలో కూడా అశ్రద్ధ వహిస్తున్నారు, ప్రతిరోజు చేయవలసిన పనులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు, గత కొన్ని రోజుల క్రితం మండల కేంద్రంలో జరిగిన ప్రజా వేదికలో కూడా జిల్లా అధికారి డిఆర్డిఏ చందర్నాయక్ కూడా హెచ్చరించడం జరిగింది, అయినా అధికారులలో ఎటువంటి మార్పు లేదు.