గుడ్డి రాజకీయాలకు స్వస్తిపలికి… బిఆర్ఎస్ శనిని వదిలంచుకున్నాం.
స్వార్థపూరిత రాజకీయాలు చేసేదెవరో ప్రజలకు తెలుసు. వల్లేపల్లి శ్రీనివాస్.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ) : ప్రజా ప్రయోజనాల కోసమే పార్టీ మారడం జరిగిందనీ మాజీ వైస్ ఎంపీపీ వల్లే పల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో ప్రెస్మిట్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. వ్యక్తిగత దూషణతో బిఆర్ఎస్ నాయకులు చేసిన ప్రెస్మీట్ వాక్యాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగ ఖండిస్తున్నా మన్నారు.10 సం.లు పార్టీ కట్టుబాట్లకు పని చేశామే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏనాడు పని చేయలేదన్నారు.మాతో కలిసి పని చేసిన వారు మాపై అనుచిత వాక్యలు చేయడం సబబు కాదన్నారు. అయిన వారినీ మేము వ్యక్తి గతంగా ఏదైనా మాట్లాదితే అది మా స్థాయిని మేము తక్కువ చేసుకున్నట్లవుతుం దన్నారు. ఇక నుండి మాపై ఎవరైనా అవాకులు,చవాకులు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మీ 30 సం.ల నీచరాజకీయాల వల్ల నియోజక వర్గంలో ఎన్ని కుటుంబాలు నష్ట పోయాయో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని వ్యక్తిగత దూషణలతో రాజ కీయాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ ప్రెస్మీట్లో కాంగ్రెస్ పార్టీ పోతంగల్ మండ ల అధ్యక్షులు పుప్పాల శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షు లు గంగాధర్ దేశాయ్,డిసిసి డెలివరీ సభ్యులు కొట్టం మనో హర్,వహీద్,కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ డా.సునీల్ కుమా ర్,మాజీ ఎంపీపీ గంధపు పవన్,ఎంపీటీసీలు అనంత విఠల్,కేశవ వీరేశం,ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు,యువజన నాయకు లు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.