బిఆర్ఎస్ కు షాక్…..
ఎంపీటీసీ మరియు ఉపసర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక ![]()
బాన్సువాడ, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ): బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్లం గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డి మరియు బోర్లం క్యాంప్ ఉప సర్పంచ్ కొండ సాయిలు మరియు బోర్లం జామా మజీద్ కమిటీ సదర్ అర్షత్ ఖాన్ మాజీ అదర్స్ షేక్ మహబూబ్, సయ్యద్ అహ్మద్ సెక్రటరీ సయ్యద్ మంజూరు, షంషీర్ ఖాన్, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు తదితరులు హస్తం గూటికి చేరారు.
ఈ కార్యక్రమంలో బోర్లం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ గౌడ్, జనార్దన్ రెడ్డి, కమ్మరి నర్సింలు, టేకుల మొగులయ్య, బెల్లాల కాశిరాం,చిన్న గంగారం, గుజ్జరి రంజిత్, గుల బాలరాజ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.సుమారు 400 మంది బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
