Take a fresh look at your lifestyle.

ముప్కాల్ లొ 13వ ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమం….

0 1,366

ముప్కాల్ లొ 13వ ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , మార్చి 14 ( లోకంతీరు ): నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో పిరమిడ్ మాస్టర్ శ్రీమతి శ్రీ లావణ్య గారి ఆధ్వర్యంలో 13వ ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జ్ఞాన దాతగా గ్రాండ్ మాస్టర్,పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈ సేతు బాలకృష్ణ గారు విచ్చేసి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించడం జరిగింది.ధ్యానం యొక్క విశిష్టతను శాకాహారం విశిష్టతను అద్భుతంగా వివరించారు.ప్రతిరోజు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని, ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందాలని, ధ్యానం ఆత్మను శుద్ధి చేస్తుందని, సరికాని భావోద్వేగాల వల్ల అనారోగ్యం పాలవుతున్నారని అవి సరి చేసుకోనంతవరకు ఆరోగ్యవంతులు కాలేరన్నారు.సరియైన భావోద్వేగాల వల్ల ఆనందం,ఆరోగ్యం లభిస్తుందన్నారు .మన చుట్టు వున్నా మనుషులు మనకు పాఠాలు నేర్పించడానికి ఉన్నారు వారిని అంగీకరిస్తే వారిలో మార్పు వస్తుందని తెలిపారు.అందుకొరకు ప్రతి ఒక్కరూ ముందుగా తామే వారే మారాలని తెలిపారు.ఈ ధ్యాన ఆత్మ జ్ఞాన కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సీనియర్ మాస్టర్లు బొడ్డు దయానంద్, అమరావాజి శ్రీనివాస్, నాగంపేట్ శ్రీనివాస్, బోధన్ సాయిలు, సత్యనారాయణ, అమృతరావు నాగంపేట లావణ్య కుటుంబ సభ్యులు.400 మంది ధ్యానులు పాల్గొన్నారు.వారందరికీ ధ్యానమృతాన్ని నాగం పేట లావణ్య గారు అందించారు.

Leave A Reply

Your email address will not be published.