Take a fresh look at your lifestyle.

భూపాలపల్లిలో విజయవంతమైన మైనింగ్ స్టాఫ్ జనరల్ బాడీ సమావేశం.

0 29

విజయవంతమైన మైనింగ్ స్టాఫ్ జనరల్ బాడీ సమావేశం.
సమస్యల పరిష్కారానికి స్ట్రక్చర్ కమిటీలో చర్చిస్తామని ఏఐటీయూసీ హామీ.
జయశంకర్-భూపాలపల్లి, జూలై 3 (ప్రజాలక్ష్యం ప్రతినిధి): భూపాలపల్లిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మైనింగ్ స్టాఫ్ జనరల్ బాడీ సమావేశం విజయవంతంగా జరిగింది. మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ–ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి మైనింగ్ సిబ్బంది అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రస్తావించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు జరిగిన సమావేశంలో మైనింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా సమావేశానికి హాజరై తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సెంట్రల్ మైనింగ్ ఇన్‌చార్జి కే. సారయ్య, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, సభ్యులు ప్రస్తావించిన ప్రతి సమస్యను నమోదు చేశామని, యాజమాన్యంతో జరిగే స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో వాటిని చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మైనింగ్ సిబ్బంది న్యాయమైన సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్, అసిస్టెంట్ సెక్రటరీ గంగసారపు శ్రీనివాస్, సమావేశ అధ్యక్షుడు తోట రామచందర్, పిట్ సెక్రటరీలు సదయ్య, వి. రాజేందర్, పి. శ్రీనివాస్, ఎల్. శంకర్, కరీముల్లా, కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు జి. తిరుపతి, జగత్‌రావు, మైనింగ్ స్టాఫ్ నాయకులు రాజ్ మహమ్మద్, సికిందర్ సింగ్, రాజారాం, వివిధ గనుల వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సమావేశాన్ని విజయవంతం చేసిన సభ్యులకు ఏఐటీయూసీ భూపాలపల్లి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఎం.డి. ఆసిఫ్ పాషా కృతజ్ఞతలు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.