బిజెపి మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన నాయకులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,మార్చి 13 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్ వద్ద బుధవారం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు ,బిజెపి నాయకులు బిజెపి మేనిఫెస్టో కొరకు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.అభివృద్ధి చెందుతున్న భారతావనికి మోదీ గ్యారంటీ.. మరోసారి మన మోదీ సర్కార్ వచ్చే ఎన్నికల కోసం రూపొందించే మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ప్రజల ఆలోచనల మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రూపొందించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ సతీష్, రాష్ట్ర బీజేపీ నాయకులు దేవేందర్, బాల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు