Take a fresh look at your lifestyle.

డిజిటల్ తరగతుల నిర్వహణకు టీవీ, కంప్యూటర్లు మంజూరు….

0 1,699

డిజిటల్ తరగతుల నిర్వహణకు టీవీ కంప్యూటర్లు మంజూరు

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ , మార్చ్ 13  ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు గత ప్రభుత్వం మంజూరు. చేసిన టీవీ కంప్యూటర్లు రావడంతో వాటిని ప్రధానోపాధ్యయులతో కలిసి మాజీ జెడ్పిటిసి పరిశీలించారు. ప్రైవేట్ పాఠశాల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా విధానం తీసుకురావాలని ఉద్దేశంతో డిజిటల్ క్లాసులు ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం అందుకు సంబంధించిన సామాగ్రిని గత 60 రోజుల కింద పంపడం జరిగింది. వైఫై సౌకర్యం లేక వాటిని ప్రారంభించడం కొంత ఆలస్యం అవుతుందని ప్రధానోపాధ్యాయుడు మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు గ్రామానికి చెందిన జిరమేష్ కి వివరించడం జరిగింది. అలాగే కంప్యూటర్లకు సంబంధించి టేబుల్ కావాలని వివరించారు. త్వరలోనే టేబుల్లు పాఠశాలకు అందే విధంగా ప్రయత్నిస్తామని మాజీ జెడ్పిటిసి హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని పాఠశాలకు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు మౌలిక వసతులపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అందుకు తాము కూడా సహకరిస్తామని వివరించారు.
డిజిటల్ క్లాసులు ఫోన్ ద్వారా వైఫై కనెక్ట్ చేసి విద్యార్థులకు బోధించడం జరిగింది ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ప్రధానోపాధ్యాయుడు లోకేశ్వర్ రావు నుకోరడం జరిగింది.
గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉన్నారని వారి ద్వారా పాఠశాలకు బెంచీలు గాని టేబుల్ గాని ఫిల్టర్ వాటర్ సంబంధించిన వాటిని ఏర్పాటు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని మాజీ జెడ్పిటిసి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తో పాటు ఉపాధ్యాయ లందరూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.