హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడం సిగ్గుచేటు..?
— ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు
— మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి

రామారెడ్డి, ఆగస్టు 17 (లోకం తీరు) : రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేమమైన చర్యని బి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు రామారెడ్డి మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి,రామారెడ్డి మాజీ సర్పంచ్ పడిగల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కాలాలి సాయ గౌడ్ ఖండించారు. శనివారం సాయంత్రం మాట్లాడుతూ గత పది ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది నెలలు కాకముందే గుండా రాజ్యం తేవాలని చూడడం సిగ్గుచేటని వారు విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధికారం కోసం హైదరాబాదులో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయ అన్నారు.రైతు రుణమాఫీ చేసే చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేసే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలో కేవలం 30 శాతం మంది కి కూడా రుణమాఫీ కాలేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ముందు రుణమాఫీ చేయడానికి ప్రయత్నించాలని సూచించారు. రైతులకు రుణమాఫీ చేసే చేతగాని దద్దమ్మ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం పై దాడి చేయడం మంచిది కాదన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఏర్పడ్డ విభేదాలే ఈ దాడులకు కారణమని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజ్యం నడిపించడానికి ప్రయత్నిస్తే బారాసా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో గంజి సతీష్ గుప్తా, మద్దికుంట మాజీ ఎంపీటీసీ రాజేందర్, లింబాద్రి నాయక్, గ్రామ అధ్యక్షుడు గొలుసుల లింగం,తదితరులు పాల్గొన్నారు.