Take a fresh look at your lifestyle.

మంత్రాల నెపంతో మహిళ హత్య కేసులో నిజామాబాద్ కోర్టు సంచలన తీర్పు….. 

0 1,786

మంత్రాల నెపంతో మహిళ హత్య కేసులో… నిజామాబాద్ కోర్టు సంచలన తీర్పు 

  • నలుగురిని దోషులుగా తేల్చిన నిజామాబాద్ కోర్టు
  • నలుగురికీ యావజ్జీన శిక్ష విధించిన కోర్టు
  • 2018లో బొణిగె భారతిని హత్య చేసిన నలుగురు నిందితులు

నిజామాబాద్, మార్చ్ 22 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని  మామిడిపల్లిలో      చేతబడి నేపంతో బోణిగె భారతిని హత్య చేసిన తోకల చిత్ర, మరో ముగ్గురు వ్యక్తులు.భారతి చేతబడి చేయడం వల్లే అనారోగ్యం పాలయ్యానని అనుమానం పెంచుకున్న చిత్ర దీంతో తన సమీప బంధువులైన ముగ్గురు యువకులతో కలిసి భారతిని గొంతు కోసి హత్య చేసిన అనంతరం మెడలో బంగారు గొలుసులు ఎత్తుకెళ్లారు.పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు మృతురాలి మెడలో ఉన్న గొలుసులు ఎత్తుకెల్లి దోపిడీ దొంగలు హత్య చేసినట్లు సృష్టించే ప్రయత్నం చేసిన నిందితులు

 పోలీసులు చాకచక్యంతో   నలుగురు నిందితుల కాళ్లు, వేలి ముద్రలు, సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ నలుగురిని కోర్టుకు అప్పగించడం జరిగింది.ప్రస్తుతం సైఫాబాద్ లో సీఐ గా విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించి  పక్కా ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించాడు. కోర్టు ఆధారాలను  పరిశీలించి ఆ నలుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.