అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి
-
మోర్తాడ్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కార్యాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 19 ( లోకంతిరు ) : మోర్తాడ్ లోని ప్రజా నిలయం భవనం జాతీయ రహదారి పక్కనగల నర్సరీని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించి పరిశీలించారు. నర్సరీ లో రాష్ట్ర ప్రభుత్వముఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక మండల అధికారులు తహసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో తిరుమల, ఏపీవో శకుంతల, కమ్మర్ పల్లి రేంజ్ ఫారెస్ట్ అధికారులతో, పాటు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం మోర్తాడ్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని, మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవ కేంద్రంను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల దరఖాస్తుల సవరణ పనులను స్వయంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే మోర్తాడ్ గ్రామంలో గల 30, పడకల ప్రభుత్వ ఆస్పత్రి సందర్శించి జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యాధికారులను జిల్లా కలెక్టర్అడిగి తెలుసుకున్నారు. మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్ గ్రామంలో గల మండల ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి అమ్మ ఆదర్శ
పాఠశాల లో కొనసాగుతున్న ప్రాథమిక పనులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా గణిత శాస్త్రం పై లెక్కలు చేయించి విద్యార్థుల ప్రతిభ, పరిజ్ఞానం స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, విద్యా బోధనపై, జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, విద్యార్థులకు విద్యాబోధన పట్ల కలెక్టర్ విద్యార్థులతో సంభాషించి, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో, కాలనీలో, వీధి వీధిలో, రోడు గుండా, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి వాటిని సంరక్షించి, చెట్లు పెరిగేలా అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా, రాజకీయాల కతీతంగా అర్హులైనప్రతి ఒక్కరికి అందించాలన్నారు. ధరణి వెబ్ సైట్ లో సవరణలు, రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయి విచారణ జరిపి భూపట్టాలను అందించాలన్నారు. అభివృద్ధి పనులపట్ల సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు నాణ్యతతో కూడిన పనులు జరిగేలా దగ్గరుండి పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల, అభివృద్ధి పనుల పట్ల అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ఫిర్యాదులు అందిన శాఖపరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కమ్మర్ పల్లి రేంజ్ ఫారెస్ట్ అధికారులతో పాటు, మండల తహసిల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో తిరుమల, ఏపీఓ శకుంతల, ఏపీఎం ప్రమీల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిర్మాజీ గోపి, కాంగ్రెస్ నాయకులు వై. శ్రీ, ఎలాలా శ్రీనివాస్, ఎంఈఓ ఆంధ్రయ్య, ఏ.వో. లావణ్య, సీ.సీ.లు, సీఆర్పీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.