Take a fresh look at your lifestyle.

కామారెడ్డి పెద్ద చెరువును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్….

0 1,240

కామారెడ్డి పెద్ద చెరువును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్

— గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ,జూలై 25 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువును మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్స్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. కామారెడ్డి పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని టెక్రియల్ సమీపంలో గల పెద్ద చెరువును నీటి లభ్యత గురించి చర్చించారు. కామారెడ్డి పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుండగా పట్టణవాసులు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ తెలిపారు. కామారెడ్డి పట్టణంకు తాగు నీటి అవసరం కోసం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి 30 శాతం మంచి నీటి సప్లై కోసం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.తాగు నీటి అవసరం కోసం 30% నీటిని వినియోగించుకోవడం కోసం ఇప్పటికే అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో మంచి నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతిపాదనలు చేస్తునట్టు తెలిపారు. తాగు నీటి అవసరం కోసం సత్వర ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, డిఈ సంతోష్, టీపిఓ గిరిధర్, కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, తైబసుల్తానా సలీం, లడ్డు మొయినుద్దీన్, ఆస్మా అంజత్,ఇరిగేషన్,
మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.