Take a fresh look at your lifestyle.

నాగన్న భావిని పున ప్రారంభించిన జిల్లా కలెక్టర్…..

0 1,273

నాగన్న భావిని పున ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : జిల్లాలోని లింగంపేటలో ఇన్ఫోసిస్ సంస్థ, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రతినిధులు, కల్పన, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.