డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా , జూలై 26 ( లోకంతీరు ) : కామారెడ్డి పురపాలక సంఘ పట్టణ పరిధిలో గల ఇందిరా నగర్ కాలనీ డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద “డ్రై డే ప్రై డే కార్యక్రమములో” భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు. ఈ కాలనీలో మురికి కాలువలు శుబ్రముగా చేయుమని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు అట్టి మురికి కాలువలు శుబ్రపరిచారు. రామారెడ్డి రోడ్డుకు ఇరువైపుల మురికి కుప్పలు తొలగించి మొక్కలు నాటుమని మరియు రంగవల్లులు చేయించవలసినదిగా ఆదేశించినారు. ప్రజలు ఎవరైనా రోడ్లపై చెత్త వేసినచో వారికి అదనంగా రుసుము విధించుమని పురపాలక సిబ్బందికి ఆదేశించినారు. అనంతరం డి ఆర్ సి సి సెంటర్ ను కూడా సందర్శించారు. అదేవిధముగా పెద్ద చెరువు ఫిల్టర్ బెడ్ సందర్శించి, చుట్టు ప్రక్కల పరిసరాలను శుభ్రం చేయించవలసినదిగా ఆదేశించినారు.
ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, చైర్ పర్సన్ పురపాలక సిబ్బంది, రెవిన్యూ డివిజినల్ అధికారి, మండల రెవిన్యూ అధికారి, కమీషనర్, పురపాలక సంఘం అధికారులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.