Take a fresh look at your lifestyle.

సమయానికి బస్సులు లేక విద్యార్థుల ఆందోళన…

0 1,337

సమయానికి బస్సులు లేక విద్యార్థుల ఆందోళన

 – డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 22 (లోకంతీరు): రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామానికి గత పదిహేను రోజులుగా విద్యార్థుల కాలేజి సమయానికి బస్సులు రావడం లేదని గురువారం ఆర్గొండ గ్రామంలో కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల అభిప్రాయం మేరకు ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు స్పందుంచి కామారెడ్డి ఆర్ టి సి డిపో మేనేజర్ కు చర వాణి ద్వారా కాలేజీ విద్యార్థులకు సమయానికి బస్సులు నడిపంచాలని చరవాణిలో తెలియజేసారు. ఈ సందర్భంగా మేనేజర్ స్పందించి కాలేజీ సమయానికి బస్సులు నడిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డిపో మేనేజర్ కు రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి వినతిపత్రాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.